
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనవరి13వ తేదీ శనివారం ఢిల్లీలో పీయూష్ గోయల్ కార్యాలయానికి వెళ్లి ఆయన కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలనికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రావాల్సిన రూ.4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు జనవరి 12వ తేదీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కలు ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పరిష్కారానికి కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.