సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

తొగుట (దుబ్బాక)/జిన్నారం, వెలుగు: రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు దుబ్బాక బస్టాండ్ వద్ద ,తొగుట మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట గ్రామాన్ని సూర్యఘర్ పథకానికి ఎంపిక చేయడంపై మంత్రి వివేక్ వెంకటస్వామికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఫొటోకు కాంగ్రెస్ లీడర్లు క్షీరాభిషేకం చేశారు.