నాతో పాటు కోమటిరెడ్డి సీఎం పదవికి అర్హుడు.. సీఎం రేవంత్ రెడ్డి

నాతో పాటు కోమటిరెడ్డి సీఎం పదవికి అర్హుడు.. సీఎం రేవంత్ రెడ్డి

భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కోమటిరెడ్డి సీఎం పదవికి అర్హుడని అన్నారు. ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని, కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసారని, రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. మోడీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందల గడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భువనగిరి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను బొంద పెట్టాలని అన్నారు. పదేండ్లు మోడీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని అన్నారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. మోడీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అన్నారు.