
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని రేవంత్ రెడ్డి కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పి.వి. చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి పి.వి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.