జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ గెలుపులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు సీఎం రేవంత్. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజల యొక్క ఆశీర్వాదామని.. గెలిస్తే ఉప్పొంగం, ఓడితే కుంగిపోమని అన్నారు సీఎం రేవంత్.కాంగ్రెస్ కు తెలిసిందల్లా ప్రజా సమస్యల పరిష్కారమేనని.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ ప్రజల మద్యే ఉందని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం నగరం నుంచే ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రజల తీర్పును బాధ్యతగా తీసుకుందామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని అన్నారు.

►ALSO READ | జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్కు కొత్త ఊపు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలతో కదం తొక్కిన శ్రేణులు

హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని.. క్లీన్ సిటీ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. ఫేక్ వార్తలు, పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. హైడ్రా, ఈగల్ పై అనేక తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు సీఎం రేవంత్. 

నగరంలో కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకే హైడ్రాను తెచ్చామని .. నగరం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయతనాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వారు పోషిద్దామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్.