మోదీ మళ్లీ గెలిస్తే.. రిజర్వేషన్లు రద్దు: సీఎం రేవంత్ రెడ్డి

మోదీ మళ్లీ గెలిస్తే.. రిజర్వేషన్లు రద్దు: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ.. దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 రిజర్వేషన్లను రద్దు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని.. 1925లో ఆర్ఎస్ఎస్ ఓ టార్గెట్ ను పెట్టుకుందన్నారు. 

ఏప్రిల్ 27వ తేదీ శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..  రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోందని చెప్పారు. కార్పొరేట్ పెట్టుబడిదారులతో మోదీ దోస్తీ కట్టాడని..  కార్పొరేట్ శక్తుల ముందు మనల్నీ కట్టుబానిసలుగా చేసే కుట్ర జరుగుతుందని సీఎం అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్

  • మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నాడు.
  • అక్రమంగా 400 సీట్లు గెలవాలని బీజేపీ కుట్ర చేస్తోంది. 
  • దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్టైక్ చేస్తోంది
  • రిజర్వేషన్లు రద్దు చేయబోమని మోదీ ఎందుకు ప్రకటించడంలేదు
  • ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గాలు రిజర్వేషన్లను వ్యతిరేకించాయి.
  • మండల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశాయి
  • మండలి కమిషన్ సిఫార్సు మేరుకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.
  • వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
  • వందేళ్లలో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే లక్ష్యం ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది
  • దమాషా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతాం
  • బీసీ జనాభాను లెక్కించడం చారిత్రాత్మకం
  • 27శాతం కంటే ఎక్కువ బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే.. బీసీ కులగణన  చేపట్టాలి
  • బీసీల డిమాండ్ల ప్రకారం జనగణన చేస్తాం.. బీసీ రిజర్వేషన్లు పెంచుతాం
  • రిజర్వేషన్లు రద్దు కాకూడదంటే.. కాంగ్రెస్ గెలవాల్సిందే
  •  రాజ్యాంగం రద్దు చేయాలని ఆనాడు కేసీఆర్ ప్రకటించలేదా?
  • కేసీఆర్ ఎవరి భావాజాలం కోసం పనిచేస్తున్నారు.
  • రిజర్వేషన్ల  రద్దుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలి
  • రాజ్యాంగం రద్దు చేస్తామంటున్న మోదీపై కేసీఆర్ పోరాటం ఏది?
  • మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెబుతున్నాడు
  • మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు
  • ఈ ఒక్కడి చాలదా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పడానికి
  • అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీల ముందుకూర్చుని నీతులు చెప్తున్నాడు
  • పంద్రాగస్టు లోపు రైతురుణ మాఫీ చేస్తాం
  • ఓడినా కేసీఆర్ లో ఇంకా అహంకారం తగ్గలేదు.
  • మానసికంగా కేసీఆర్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • 5 పార్లమెంట్ నియోజకవర్గాలను బీఆర్ఎస్, బీజేపీకి తాకట్టు పెట్టింది.