బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ : సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ : సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో  ఆయన పాల్గొన్నారు.   ఏపీకి ఇప్పుడు కావాల్సింది పాలించే  నాయకులు కాదని ప్రశ్నించే గొంతుకలని చెప్పారు.  జగన్, బాబు ఎవరూ గెలిచినా మోదీకి బానిసలేనన్నారు. మోదీని ఎదిరించి శక్తి వీరికి లేదన్నారు. ఏనాడూ వైఎస్సార్ బీజేపీ అంటకాగలేదన్నారు.  వైఎస్సార్  నిజమైన వారసురాలు షర్మిల అని చెప్పుకోచ్చారు. 

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని  చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు  అని విమర్శించారు.

దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని  సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.