
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ ఫుట్‌బాలర్, తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్యను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇండియా ఫుట్‌బాల్ టీమ్ తరఫున అద్భుతంగా ఆడుతూ ఈ ఏడాది ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సౌమ్య మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. తన అవార్డును సీఎంకు చూపించింది.
ఫుట్‌బాల్‌లో విశేష ప్రతిభ చూపెట్టిన సౌమ్యను సీఎం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, వీసీ ఎండీ సోనీబాలా దేవి, స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ రఫాత్, జనరల్ సెక్రటరీ పాల్గుణ పాల్గొన్నారు.