పద్మ అవార్డుల గ్రహితలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

పద్మ అవార్డుల గ్రహితలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం  దేశ అత్యుత్తమ పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా జనవరి 26వ తేదీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి..  పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు తెలిపారు. పద్మ విభూషన్ పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలు ఎంపికయ్యారు.. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠిలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమల్ లాల్ లు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 

వీరితోపాటు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు దివంగత బిందేశ్వర్ పాఠక్, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి దివంగత ఎం ఫాతిమా బీవీ, బాంబే సమాచార్ యజమాని హార్ముస్జీ ఎన్ కామా సహా మొత్తం 132 మంది ప్రముఖులకు గురువారం పద్మ అవార్డులు లభించాయి.