చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ దుర్ఘటనలో బాధితులకు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిన కొనసాగించాలని, సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని సీఎస్, డీజీపీతో ఫోన్లో మాట్లాడి సీఎం ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని చెప్పారు.
* రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
* అతివేగంతో బస్సును ఢీకొన్న కంకర లోడుతో వెళుతున్న టిప్పర్
* ఈ దుర్ఘటనలో కంకర మీద పడి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు
* ఇప్పటివరకూ 20 మంది ప్రయాణికులు మృతి
* చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ నుంచి చికిత్స నిమిత్తం గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలింపు
* ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
* చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
* చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
* బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
* తాండూరు డిపోకు చెందిన బస్సుగా గుర్తించిన పోలీసులు
