ఆర్టీసీ బస్సులో వెళ్లి.. ఫూలే సినిమా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

ఆర్టీసీ బస్సులో వెళ్లి.. ఫూలే  సినిమా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

హైదరాబాద్‌‌‌‌: మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ సినిమాను సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వీక్షించారు. 

సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సుల్లో బంజారాహిల్స్‌‌‌‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌కు వెళ్లి సినిమా చూశారు. 

మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.