తెలంగాణ కవులు,కళాకారులకు సీఎం సన్మానం

తెలంగాణ కవులు,కళాకారులకు సీఎం సన్మానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కోటి రూపాయల చెక్కులను అందజేశారు.

తెలంగాణలోని  తొమ్మిది మంది కవులు రాష్ట్రానికి అందించిన  విశేష సేవలకు గానూ.. ఒక్కొక్కరికి  కోటి రూపాయల నగదుతో పాటు.. ఫ్యూచర్ సిటీలో 300 గజాల  ఇంటి స్థలం, తామ్ర పత్రాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి  2024 డిసెంబర్9న  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో  వారికి చెక్కులు అందజేశారు. 

తొమ్మిది మంది కవులు వీళ్లే...

  • అందెశ్రీ
  • పాశం యాదగిరి
  • గద్దర్
  • గోరేటి వెంకన్న
  •  బండి యాదగిరి
  • సుద్దాల అశోక్ తేజ
  •  జయరాజ్
  • గూడ అంజయ్య
  • ఎక్కా యాదగిరి రావు