హిందూ దేవుళ్లపై మాట్లాడినట్టు ట్రోల్స్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం మాట్లాడిన ఆయన.. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని రేవంత్ అన్నారు. డీసీసీ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేశారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేీపీ వివాదం చేస్తోందన్నారు.
హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా,యువ మోర్చా కార్యకర్తలు ఇవాళ ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా గాంధీ భవన్ వైపు దూసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు ,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమలో తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరంలో బీజేవైఎం,మహిళ మోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు గాంధీ భవన్ ను ముట్టడించేందుకు వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం సమయాత్తం అవుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
