లింగమ్మ ఏం సంగతి..?.. సీతక్కను అడగండి.. మీకు ఇండ్లు ఈ సారే ఇస్తడు: రేవంత్

లింగమ్మ ఏం సంగతి..?.. సీతక్కను అడగండి.. మీకు  ఇండ్లు ఈ సారే ఇస్తడు: రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ మండలం మాచారం గ్రామంలో  ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేశారు. కాసేపు రైతులతో మాట్లాడారు రేవంత్. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు వాళ్ల సమస్యలు చెప్పుకున్నారు. రైతులతో  మాట్లాడుతుండగా.. రేవంత్ కల్గజేసుకుని  లింగమ్మ అనే మహిళను పిలిచి మీకు ఏ సమస్యలున్నాయని అడిగారు రేవంత్. ఈ సందర్భంగా ఆ మహిళ తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు. అయితే ఇగో ఇండ్లు ఇచ్చే సార్  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఇక్కడే ఉన్నారు..అడగాల్సింది మంత్రి సీతక్కను ..ఇవ్వాల్సింది పొంగులేటి అని వాళ్లతో చెప్పారు. పది రోజుల్లో మీకందరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత తనదన్నారు రేవంత్. మరో ఏడాదికి మళ్లీ వస్తానని చెప్పారు రేవంత్.

నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో సౌర విద్యుత్​ ద్వారా నీరందించే  ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్​రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

►ALSO READ | సౌర గిరి జల వికాసానికి శ్రీకారం.. రైతులకు సోలార్ పంపు సెట్లు

 ఆదివాసీ, చెంచు, గిరిజనుల సాగుభూమికి సాగునీటి వసతి కల్పించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లతో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.10 లక్షల గిరిజన ఫ్యామిలీలకు లబ్ది చేకూరనుంది. మాచారం గ్రామంలో ఎంపిక చేసిన 26 మంది చెంచుల భూముల్లో బోర్లు తవ్వించి, సోలార్​ ప్యానెల్స్,​ మోటార్లు, పైప్​లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటారు. తోటల మధ్యలో అంతర్గతంగా ఆరుతడి పంటలు సాగుకు అనువుగా పైప్​లైన్లు ఏర్పాటు చేశారు.