మన్నె జీవన్ రెడ్డికి బీఫాం అందజేసిన సీఎం రేవంత్

మన్నె జీవన్ రెడ్డికి బీఫాం అందజేసిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బీఫాం అందజేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందని ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశాలు నిర్వహించాలని జీవన్ రెడ్డికి సీఎం సూచించారు.

జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం షురూ అయిందని లోకల్ బాడీ ప్రజా ప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే విషయాన్ని లీడర్లకు తెలియజేశాలని సీఎం పేర్కొన్నారు.