నంది కాదు గద్దర్ అవార్డు.. నా మాటే శాసనం: సీఎం రేవంత్

నంది కాదు గద్దర్ అవార్డు.. నా మాటే శాసనం: సీఎం రేవంత్

తెలంగాణలో ఇక నంది అవార్డుల ప్లేసులో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.  గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు, పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు.  హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్  జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...చాలా మంది సినీ ప్రముఖులు అవార్డుల గురించి తనతో చర్చించారు.. ఇక నుంచి నంది అవార్డుల స్థానంలో  గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు. ఈ వేదిక నుంచే మాటిస్తున్నానని చెప్పారు. గద్దర్ ను ఈ విధంగానైనా సత్కరించుకునే అవకాశం దొరికిందన్నారు.

గద్దర్ పేరుతో జిల్లా.. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెట్టాలన్న విజ్ఞప్తిని కేబినెట్ లో చర్చిస్తామన్నారు రేవంత్. సమాజ చైతన్యానికి గద్దర్ జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు.  బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ ముందుకు నడిపారు.  త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పాటైంది..  సాధించిన తెలంగాణలో కొందరు చీమల పుట్టలో పాములు చేరినట్లు చేరారు.గడీల పాలనను గద్దర్ వ్యతిరేకించారని తెలిపారు రేవంత్..