ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా వస్తే.. మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతరు: రేవంత్రెడ్డి

ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా వస్తే.. మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతరు: రేవంత్రెడ్డి

హైదరాబాద్: మా ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌజ్ లో చిందులు వేస్తోంది.. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా? రైతు బడ్డ కూర్చోకూడదా అని  ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారని హెచ్చరించారు రేవంత్రెడ్డి. తెలంగాణ ప్రజలను అవమానించిన మోదీ ఓట్లెలా అడుగు తారని అన్నారు. కాంగ్రెస్ వైపు కన్నెత్తి చేస్తే మా ఆడబిడ్డలు గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటారని అన్నారు. రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఐదేళ్లలో మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక  మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు..63 లక్షలు కాదు.. కోటి మంది సభ్యులు కావాలి..ఐదేళ్లలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది..ధనిక తెలంగాణగా మారుతుందన్నారు. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన  స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.