తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళాశక్తి సోనియమ్మ

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళాశక్తి సోనియమ్మ

సోనియా మాటయిస్తే వెనక్కి వెళ్లరు.. మా నాయకురాలు సోనియా అనిగర్వంగా చెప్పుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయంగా నష్టముంటుందని తెలసినా తెలంగాణ ఇచ్చారు.. సోనియా నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంతో జర్నీ ప్రారంభించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టిస్తామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దొని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. 90 రోజుల్లో 25కోట్లమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు సీఎం  రేవంత్ రెడ్డి. 

మహిళా శక్తి సహకారంతో కేసీఆర్ ను బండకేసీ కొట్టి 100 మీటర్ల గోతిలో పాతిపెట్టి అధికారంలోకి వచ్చామన్నా రు సీఎం రేవంత్ రెడ్డి. అడ్డొస్తే బీఆర్ ఎస్ పైకి ప్రగతి రథాలు ఎక్కిస్తామన్నారు. రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1200 చేసిన గాడిద ఎవరు అని ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని కేసీఆర్ అథోగతి పాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆడబిడ్డలకోసం రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇంటిని చక్కదిద్దేది మహిళలే.. అందుకే అన్ని పథకాలు మహిళల కే ఇస్తున్నామన్నారు.. ఇంటాయన చేతిలో పెడితే బెల్ట్ షాపులకే వెళ్తాడని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.