మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ ఈ నలుగురి దుష్ట్ చతుష్టయం .. దేశాన్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోడీ ప్రజల సొమ్మును షేర్ మార్కెట్ల ద్వారా అదానీకి దోచిపెడుతున్నారని అననారు. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపించాలన్నారు. సెబీ చైర్మన్ పై ఆరోపణలపై చట్ట సభల్లో కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. అదానీని కాపాడేందుకే మోదీ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదానీపై జేపీసీతో విచారణ జరిపించాలని రాహుల్ పార్లమెంట్ లో డిమాండ్ చేస్తే మోదీ తప్పించుకున్నారని అన్నారు. సమాధానం చెప్పలేక నాలుగు రోజల ముందే పార్లమెంట్ ను వాయిదా వేశారన్నారు.
దేశాని నలుగురు గుజరాతీలు దోచుకుంటున్నారు..మోదీ,అమిత్ షా అంబానీ,అదానీలకు దోచి పెడుతున్నారు.. బీజేపీ దోపిడిపై బీఆర్ఎస్ ఎందకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దేశానికి బీజేపీ ముప్పులా మారింది..
ప్రతి చిల్లర విషయంలో స్పందించే కేటీఆర్ దీనిపై ఎందుకు స్పందించరు..అదానీ అవినీతిపై కేసీఆర్,కేటీఆర్ ఎందుకు స్పందించరు అని అన్నారు. ఇందిరా గాంధీ బ్యాంకులను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.