తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

 తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

తుక్కుగూడలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.  ఏప్రిల్ 06న తుక్కగూడలో జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అదే రోజున  జాతీయ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభ వేదికగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. సుమారుగా పది లక్షల మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తో్ంది. జనసమీకరణ ఏర్పాట్లలో ప్రజలున్నారు. తుక్కుగూడ సభలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 5 గ్యారంటీలను ప్రకటించనుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది.  

ALSO READ :- Exam Results : పాస్ కాకపోతే ఏమైతది.. జీవించటమే నిజమైన సాహసం.. చదువొక్కటే కాదు ముఖ్యం