కేసీఆర్​కు సీఎం ఆహ్వాన లేఖ

కేసీఆర్​కు సీఎం ఆహ్వాన లేఖ
  • ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి
  • ఫామ్​హౌస్​కెళ్లి లేఖ, ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రొటోకాల్​ సలహాదారు

హైదరాబాద్​, వెలుగు: జూన్‌‌ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్‌‌ను సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆహ్వానించారు. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు పంపారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌‌ సలహాదారు హర్కర్‌‌ వేణుగోపాల్‌‌, డైరెక్టర్‌‌ అరవింద్‌‌ సింగ్‌‌ సీఎం సూచన మేరకు ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రికను అం దించేందుకు కేసీఆర్​ సిబ్బంది, కార్యాలయ ఆఫీసర్లతో సం ప్రదింపులు జరుపగా.. ఫామ్​ హౌస్‌‌ లో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. దీం తో ప్రభుత్వ ప్రొటోకాల్‌‌ సలహా దారు హర్కర్‌‌ వేణుగోపాల్ ఫామ్‌‌ హౌస్‌‌కు వెళ్లి స్వయంగా ఆహ్వా నాన్ని, సీఎం రేవంత్‌‌ రాసిన లేఖను అందజేయనున్నట్లు తెలిసింది.