
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.665 పేజీల కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించినందున త్వరలో శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయపక్షాల అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు రేవంత్.
గూడుపుఠాణిపై కవిత ఎందుకు ఫిర్యాదు చేయలే
‘‘మేఘా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్ ఎందుకు విచారణకు పిలవలేదని కవిత అంటున్నారు కదా?’’ అని మీడియా ప్రస్తావించగా.. ‘‘అది వాళ్ల నాన్నను అడగాలి. ఎందుకంటే ఎవరికి ఏమి ముట్టజెప్పారనేది వాళ్ల ఫాదర్ కి తెలుసు కదా! లేకపోతే కవితనే ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఎవరెవవరు తమ తండ్రితో కుమ్మక్కయ్యారో నివేదిక ఇవ్వాల్సింది. అలాగే తమ బావ హరీశ్‌రావు ఎవరి నుంచి కమీషన్లు పొందారో చెప్పాల్సింది. వీళ్లందరూ తోడు దొంగలు.. గూడుపుఠాణి చేశారు? అని కమిషన్‌కు ఒక కంప్లైంట్ ఇచ్చిఉంటే కచ్చితంగా పిలిచి ఉండేవాళ్లు.. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆమె ఎవరిని అడుగుతారు.. ఒకవేళ జస్టిస్ ఘోష్‌ను ప్రశ్నించాలంటే వారు కోల్‌కతాకు వెళ్లి ప్రశ్నలు వేయొచ్చు” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.