ముగిసిన ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ముగిసిన ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

రెండ్రోజుల బిజీబిజీ షెడ్యూల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు సీఎం. ఉదయం UPSC చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు.  సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, CS శాంతి కుమారి, మరో ఇద్దరు IAS అధికారులు మనోజ్ ని కలిశారు. యూపీఎస్సీ పార ద ర్శ కత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేద ని, ఇంత సుదీర్ఘ కాలంగా అంత స మర్థంగా యూపీఎస్సీ పని చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్ర క్రియలో నూత న విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్న ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై యూపీఎస్సీ చైర్మన్ స్పందించారు. UPSCలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.

మధ్యాహ్నం డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్క డ ఉన్న రక్షణశాఖ భూమినుబ దిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.  హైదరాబాద్ నుంచి కరీంన గర్-రామ గుండం ను క లిపే రాజీవ్ రహదారిలో.. ప్యార డైజ్ జంక్ష న్ నుంచి అవుట ర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖభూమి అవసరమని దానిని రాష్ట్ర ప్ర భుత్వానికి బ దిలీ చేయాల ని కోరారు. 

ఆ తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాసీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వెనకబడిన జిల్లాలకు 18 వందల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. 15 వ ఆర్థికసంఘం నుంచి రావాల్సిన 2 వేల కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. హైద రాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.నిధుల విడుదలకు నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. కాగా శనివారం వివిధ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.