
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్ పీఎస్సీ)ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మంగళవారం సచివాయంలో ఉన్నతాధికారులతో TSPSC, ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలను అత్యంత పారదర్శకంగా.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
10వ తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని... గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు వర్సీటీల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న UPSCతో సహా పలు రాష్ట్రాలకు అధికారుల బృందాన్ని పంపాలని సీఎం నిర్ణయించారు. UPSCతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పని తీరును అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.