చిన్న వయసులోనే గడ్డం వంశీ ఎంపీ అయ్యిండు: సీఎం రేవంత్

చిన్న వయసులోనే గడ్డం వంశీ ఎంపీ అయ్యిండు: సీఎం రేవంత్

చదువుతోనే అసమానతులు తొలగిపోతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  చాలా మంది మహనీయులకు గుర్తింపునిచ్చింది కులం కాదు చదువని చెప్పారు.  ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువొక్కటే మార్గం  అని చెప్పారు. సామాజిక రుగ్మతలు తొలగిపోవాల్సిన  అవసరముందన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డ్స్ ప్రదానోత్సవంలో రేవంత్ పాల్గొన్నారు.

ఇవాళ ఈ వేదికపై ఉన్న  డాక్టర్ ఎంపీ కావ్య కావొచ్చు..ఎంపీ వంశీ కానీ చిన్న తనంలోనే చదువుకుని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లంతా వాళ్ల జీవితంలో రాణిస్తున్నారంటే..ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్...మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యంగమే కారణం అని అన్నారు.

సురవరం స్పూర్తిని కొనసాగించేలా తెలుగు యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టుకున్నామని చెప్పారు. సురవరం నిజాంకు వ్యతిరేకంగా ప్రజల్లో  చైతన్యం తెచ్చారని చెప్పారు. మహిళా వర్శిటికీ చాకలి ఐలమ్మ పేరు పెట్టామన్నారు.