గ్రూప్ 1 కి అర్హత వయసు 46 ఏళ్లకు పెంపు :సీఎం రేవంత్రెడ్డి

గ్రూప్ 1 కి అర్హత వయసు 46 ఏళ్లకు పెంపు :సీఎం రేవంత్రెడ్డి

గ్రూప్ 1 ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తొందర్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేస్తామని సీఎం రేవంత్ రడ్డి అన్నారు. గ్రూప్ వన్ ఏజ్ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. 46 ఏళ్లకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.

గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. నోటిఫికేషన్లు ఇచ్చినా. .పేపర్ లీకేజీలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ చేపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

త్వరలో పోలీసు శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో పదిహేను రోజులు 15 వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్ లర్ల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.