సభకు కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేది: సీఎం రేవంత్ రెడ్డి

సభకు కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే బాగుండేదని సీఎం అన్నారు. సభకు రాకపోవడం అసెంబ్లీ మర్యాదను అవమానించినట్లే అన్నారు. ప్రతి పక్ష నేతలు ఇప్పటికైనా సరైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి . 

రాష్ట్రంలో రాచరిక పోకడలు పోవాలని  మాప్ర భుత్వం నిర్ణయించింది. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చింది. అయినా మేం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. మా సర్కార్  సంక్షేమ పధకాలు అమలు చేసి సరిగ్గా రెండు నెలలు.. ప్రతిపక్ష నేతలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతమే కాదు.. ఒక ఎమెజన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎంతో అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. పోరాటంలో అడుగడుగునా ఉద్వేగపూరితమైన సంఘటనలే కనిపిస్తాయన్నారు. అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థులు సొంత రాష్ట్రం తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 60 యేళ్ల సుదీర్ఘ పోరాటంలో కన్న కలలు నిజం చేసుకోవాలన్న ఆశతో తమ జీవితంలో వెలుగు వస్తుంది ప్రజలు ఆకాంక్షించారన్నారు. అయితే తొమ్మిదిన్నరేళ్లలో అవి నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.