వడ్డించే వాడిని నేను ఎన్నికోట్లైనా సరే..రెండేండ్లలో కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

వడ్డించే వాడిని నేను ఎన్నికోట్లైనా సరే..రెండేండ్లలో కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

రెండేండ్లలో నారాయణపేట–కొడంగల్ ​లిఫ్ట్​ ఇరిగేషన్ ​ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్డించే వాడిని తానేనని.. ఏ రాత్రైనా ఎన్నికోట్లైను నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని చెప్పారు.పాలమూరులో పాడిపంటలు పండించి దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు సీఎం.  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సానుభూతి పరులను గెలిపించాలన్నారు.పదేండ్లు అండగా ఉంటే వందేండ్ల అభివృద్ది చేసి చూపిస్తానని చెప్పారు రేవంత్. 

రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  •  గత పాలకుల నిర్లక్ష్యమే మక్తల్ వెనకబాటు
  • అందుకే పాలమూరు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు 
  • పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది...మోసగిస్తే పాతిపెడుతుంది
  • తెలంగాణ వస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆశించాం
  • పాలమూరులో ఊరు లేకపోయినా. పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించాం
  • ఎంపీ అయినా.. సీఎం అయినా కేసీఆర్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేయలేదు
  • పదేండ్లు మహబూబ్ నగర్ జిల్లాను కేసీఆర్ పట్టించుకోలేదు
  • నన్ను ఆశీర్వదించి 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు ఇచ్చారు
  • మీ మద్దతుతోనే తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ఉన్నాను
  • పాలమూరు చైతన్యమై కాంగ్రెస్ ను గెలిపించారు.
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం
  • ఈ ప్రాంతానికి గత పాలకులు నీళ్లు ఇవ్వాలన్నఆలోచన చేయలేదు
  • పదేండ్లు మన బాధ విన్నోడు లేడు..అర్థం చేసుకున్నోడు లేడు
  • కొడంగల్ ప్రాజెక్టుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం ఇచ్చాం
  • ఎకరాకు రూ. 20లక్షలు ఇచ్చి రైతుల సంపూర్ణ మద్దతుతో భూసేకరణ చేశాం
  • రెండేండ్లు 24 గంటలు పనిచేసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది
  • పాడిపంటలు పాలమూరులో పండాలి దేశానికి ఆదర్శంగా ఉండాలి
  • ప్రతి పేద బిడ్డకు విద్యను అందించాలనే మా ఆలోచన
  • ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
  • జిల్లాలో 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నాం
  • 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నాం
  • రూ.2800కోట్ల చదువుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించాం
  • మేం ఫ్రీ బస్సు ఇస్తే బీఆర్ఎస్ వాళ్లు ఆటోవాళ్లను జమచేసి ఎగదోస్తున్నారు
  • ఫ్రీ బస్సును ఇస్తుంటే ఓర్వనోల్లు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు
  • ఆర్థిక చేయూత కోసమే మహిళా సంఘాలకు బస్సులు,పెట్రోల్ బంకులు
  • సోలార్ పవర్ ప్లాంట్ ను మహిళాకు సంఘాలకు ఇచ్చాం
  • స్వయం సహాయక సంఘాలకు హైటెక్ సిటీలో భూమి ఇచ్చాం
  • మహిళలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ కల్పిస్తున్నాం
  • వందేండ్ల చరిత్రలో బీసీల లెక్కులు తేల్చిందిమేమే
  • సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ సానుభూతి పరులనే గెలిపించండి
  • అభివృద్ధిని అడ్డుకునేవాన్ని ఎన్నుకుంటే ఇబ్బందులొస్తాయి
  • పదేండ్లు పాలమూరు ప్రజలంతా కలిసి ఉందాం
  • అభివృద్ది కోసం జిల్లా అంతా ఏకం కావాల్సిందే
  • మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది
  • మంచోడిని సర్పంచ్ గా ఎన్నుకోవాలి
  • పదేండ్లు కాంగ్రెస్ కు అండగా ఉండాలి..వందేళ్ల అభివృద్ధి చేస్తా
  • పాలమూరుగడ్డపై బీఆర్ఎస్ వాళ్లకు చోటివ్వొద్దు