అనుమండ్ల గుడి లేని ఊరు ఒండొచ్చు.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు: సీఎం రేవంత్

అనుమండ్ల గుడి లేని ఊరు ఒండొచ్చు..  ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు: సీఎం రేవంత్

రాష్ట్రంలో అనుమండ్ల గుడి లేని ఊరు ఒండొచ్చు..  ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడికి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు. వైయస్ సీఎంగా ఉన్నపుడు 25 లక్షల ఇండ్లు కట్టించామని.. పదేండ్లలో కేసీఆర్ ఎంతమందికి ఇండ్లు కట్టించారని ప్రశ్నించారు. శుక్రవారం (2025, డిసెంబర్ 05) వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన సీఎం.. రూ.508 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సీఎం రేవంత్ కామెంట్స్:

  • వరంగల్ పర్యటనకు వస్తే స్ఫూర్తి కలుగుతుంది
  • పోరాట యోధుల స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నాం
  • గత పాలకులు ఫామ్ హౌస్ లు నిర్మించారు.. కార్లు కొన్నారు..
  • పదేండ్లు పాలించిన వాళ్లే ఆస్తులు పెంచుకున్నారు
  • ఈ ప్రాంత ప్రజలకు పదేండ్లలో ఏమీ రాలేదు
  • వరి వేస్తే ఉరి అని ఆనాడు కేసీఆర్ అన్నారు
  • మేము బోనస్ అంటున్నాం
  • దుక్కిదున్నే ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం
  • ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ ది
  • రెండేండ్ల క్రితం గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం
  • పదేండ్లు దోచుకున్న వారి గడీలకు కరెంటు పీకేశాం
  • ప్రజాపాలనకు రెండు సంవత్సరాలు పూర్తయింది.
  • మేము వస్తే రైతుబంధు ఉండదని.. రుణమాఫీ అబద్ధమని ప్రచారం చేశారు
  • మేము వచ్చిన వెంటనే రూ.20 వేల 600 కోట్ల రుణమాఫీ చేశాం
  • దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ
  • రాష్ట్రంలో కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తున్నాం
  • ఆనాడు వడ్లు కొనేపరిస్థితే లేక కల్లాల్లోనే రైతులు ప్రాణాలు విడిచేవారు
  • ఇప్పుడు మేము బోనస్ లు ఇచ్చి రైతుల జేబు నింపుతున్నాం
  • రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 10 లక్షల రేషన్ కార్డులున్నాయి.
  • ప్రతి పేద వాడి ఆకలి తీర్చాలనుకున్నాం.. తీర్చాం
  • 3 కోట్ల 10 లక్షల మందికి ఇవాళ సన్నబియ్యం ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం
  • హైదరాబాద్కు ఏమేమి ఉన్నాయో.. వరంగల్కు కూడా అవే తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. 
  • మార్చి 31 లోపల వరంగల్లో ఎయిర్పోర్టును ప్రారంభించుకుంటాం.. 
  • వరంగల్లో అండర్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించుకుంటాం.. 
  • సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసే బాధ్యతను మహిళలకు అప్పగించాం