
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.303 కోట్లు కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎలివేటెడ్ కారిడార్ల వల్ల ప్రైవేట్ ఆస్తులు కోల్పోతున్న వ్యక్తులకు ఎలాంటి నష్టం జరుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణంతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగడంతో పాటు కంటోన్మెంట్నియోజకవర్గ స్వరూపమే మారిపోతుందన్నారు.