
పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పులపాలైన ఏపీ సర్కారు, బనకచర్ల కోసం మరో రూ. 82వేల కోట్ల అప్పు చేసేందుకు ఎందుకు తెగిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ‘గోదావరి ట్రిబ్యునల్అవార్డు’కు విరుద్ధమని, అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెబుతున్నా.. ఈ ప్రాజెక్ట్ మరో కాళేశ్వరంలా మారి, ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్ఎక్స్పర్ట్స్, మేధావులు హెచ్చరిస్తున్నా చంద్రబాబు సర్కార్ వెనక్కి తగ్గడం లేదు.
బనకచర్ల ప్రాజెక్టుతో పోలిస్తే గోదావరి–కావేరి లింక్ చాలా ఉత్తమమని వెదిరె శ్రీరామ్ తెలిపారు. ఇప్పటికే ఇచ్చంపల్లి దగ్గర సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై అధ్యయనం చేసిందని చెప్పారు. అక్కడ జలాల్లేవని తేల్చిందని తెలిపారు. అయితే, ఎగువన చత్తీస్‌గఢ్ వాడుకోకుండా ఉన్న నీళ్లలో 147 టీఎంసీలను తరలించేందుకు కేంద్రం జీసీ లింక్‌ను ప్రతిపాదించిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రమే 90 శాతం నిధులను ఖర్చు చేస్తుందని, మళ్లించే జలాల్లోనూ అత్యధిక వాటా తెలంగాణ, ఏపీకే అందుతాయని వివరించారు.
ALSO READ : ఏపీలో బనకచర్ల వ్యతిరేక ఉద్యమం..కాంట్రాక్టర్ల కోసమే అంటూ విమర్శలు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి 147 టీఎంసీల్లో కనీసం 100 టీఎంసీలను వినియోగించుకునే అవకాశముంటుందని వెల్లడించారు. కాగా, పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మీడియాతో వెదిరె శ్రీరాం చిట్‌చాట్ చేశారు. జీసీ లింక్ ప్రాజెక్టులో మళ్లించనున్న 147 టీఎంసీలకు సంబంధించి చత్తీస్‌గఢ్ గతంలో అంగీకారం తెలిపినా, ప్రస్తుతం విముఖత చూపుతున్నదని తెలిపారు. సొంతంగా పలు ప్రాజెక్టులను చేపడుతున్నదని వివరించారు. ఆ రాష్ట్రాన్ని ఒప్పిస్తామని, ఆ రాష్ట్రం ఒప్పుకుంటే ఆర్థిక ప్యాకేజీని కూడా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు జీసీ లింక్ ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు.