
యాదాద్రి, వెలుగు : మాతా, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ ఏడాది జరిగిన మాతా, శిశు మరణాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన 52 మంది తల్లులు, 25 మంది శిశు మరణాలు జరిగినట్టుగా హెల్త్ స్టాఫ్ వివరించారు.
శిశు మరణాల్లో బరువు తక్కువగా పుట్టడం, గుండె సంబంధిత కారణాల వల్ల మరణాలు సంభవించినట్టు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటే మరణాల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక సేవా దృక్ఫథంతో డాక్టర్లు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
సదుపాయాలు కల్పించాలి..
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే స్టూడెంట్స్‌కు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్టూడెంట్స్‌ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం రాజాపేట మండలం బూరుగుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, తహసీల్దార్ఆఫీసులో భూభారతి అప్లికేషన్లను పరిశీలించారు.
ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్భాస్కర్రావు, డీఆర్డీవో నాగిరెడ్డి, డీఈవో సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, డీఎంహెచ్‌వో డాక్టర్ మనోహర, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద పాల్గొన్నారు.