
పంజాబ్‌లో జరిగిన 114 ఏళ్ల మారథాన్ లెజెండ్ ఫౌజా సింగ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఘటన జరిగిన 30 గంటల్లోనే నిందితుడు కెనడాకు నుంచి వచ్చిన అమృత్ పాల్ సింగ్ థిల్లాన్ (30) ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 14న మారథాన్ లెజెండ్ ఫౌజా సింగ్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం సమీపంలో ఫౌజా సింగ్ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనం పంజాబ్ రిజిస్టర్డ్ వైట్ టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ అని గుర్తించారు. ఫౌజా సింగ్ ఢీకొట్టిన వాహనం నడిపిన వ్యక్తి కెనడా నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్ ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్ సింగ్‌ను త్వరలోనే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.