స్వార్థం, కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ పతనం: సీఎం రేవంత్ రెడ్డి

స్వార్థం, కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ పతనం: సీఎం రేవంత్ రెడ్డి

స్వార్థం, కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ పతనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని.. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు.

వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరిగా కేసీఆర్ నీతులు చెబుతున్నారని సీఎం  మండిపడ్డారు.  గతంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 61 మంది ఎంఎల్ఏ, ఎంఎల్సీలను చేర్చుకున్నది ఎవరు? అని ప్రశ్నించారు.  నెలరోజులు గడవకముందే మా ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ చెప్పారని అన్నారు.

లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడం కోసం బీఆర్ఎస్.. తమ ఓట్లను గంపగుత్తగా బీజేపీకి వేయించిందని విమర్శించారు. మొన్నటివరకు గేట్ వరకు కూడా రానీయ్యని ఎమ్మెల్యేలను.. ఇప్పుడు పిలిచి భోజనాలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు మమ్మల్ని ఏనాడైనా పిలిచారా?.. తాము ప్రతిపక్ష నేతకు గౌరవం ఇస్తూ పిలిచామన్నారు.  వేడుకలకు కేసీఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. 

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా పాలన చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.