ప్రతి గింజ వరకు కొంటాం..తడిసిన ధాన్యానికి కూడా మద్ధతు ధర: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతి గింజ వరకు కొంటాం..తడిసిన ధాన్యానికి కూడా మద్ధతు ధర: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నా.. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పిస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో మరే ప్రభుత్వ హయాంలో లేని విధంగా.. తెలంగాణలోనే అత్యధికంగా వరి పంట పండిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఇప్పటికే రైతుల నుంచి ధాన్యం సేకరించి.. రూ.11 వేల కోట్లు నేరుగా చెల్లించామని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడానికే పరిమితమైందని.. రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.16,470 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

వరి ఉత్పత్తిలోనే కాకుండా.. ధాన్యం కొనుగోళ్లలోనూ దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు ఇసుక లారీలతో పాటు ఇతర రవాణా వాహనాలను రాబోయే నాలుగు ఐదు రోజుల పాటు ధాన్యం కొనుగోళ్లకే వినియోగించాలని అధికారులను ఆదేశించారు. బెంగాల్ ఎన్నికల కారణంగా బీహార్, బెంగాల్ నుంచి వచ్చే హమాలీల కొరత ఏర్పడిందని.. అయినప్పటికీ ప్రొక్యూర్మెంట్‌పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. రుతుపవనాలు రాకముందే వరి ధాన్యాన్ని సురక్షితంగా మిల్లులకు చేర్చాలని కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రతిపక్షాలది ముసలి కన్నీరు:  పొంగులేటి శ్రీనివాస్ 

ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారుస్తున్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది.  గత లో రైతులకు సంకెళ్ళు వేశారు. ఈ ఏడాది ఊహించిన దానికంటే ఎక్కువ  ధాన్యం ఉత్పత్తి అయ్యింది. కొంత మంది యాత్రలు చేస్తున్నారు. వడ్లు అంటే కూడా తెలియని వారు మాట్లాడుతున్నారు. రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు. బస్సు యాత్ర చేసే వారికి చెబుతున్నా...మీరు చేసే పని చెయ్యాలి అని హితవు.