బిల్డర్లు ఆర్థికంగా బలపడితేనే ..రాష్ట్రం బాగుపడ్తది: సీఎం రేవంత్

బిల్డర్లు ఆర్థికంగా బలపడితేనే ..రాష్ట్రం బాగుపడ్తది: సీఎం రేవంత్

బిల్డర్లు ఆర్థికంగా బలపడితేనే..రాష్ట్రం బాగుపడుతదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  హైదరాబాద్ లోని హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న అల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్  హాజరయ్యారు.  ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..  మీరందరూ అండగా నిలబడితే అధికారంలోకి వచ్చామన్నారు. సమస్యలు రాకుండా చూసినప్పుడే మంచి ప్రభుత్వం ఉన్నట్లన్నారు.

నగరంలో గొలుసు కట్టు చెరువులు నిర్మించింది కాంగ్రెస్సేనన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను లేక్ సిటీగా అభివృద్ధి చేశామన్నారు. హెరిటేజ్ కట్టడాలను నిర్మించింది బిల్డర్లని చెప్పారు.  మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ అభివృద్ధికి ప్రణాళిక  రూపొందించామన్నారు. దేశంలోని 5 మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. హైదరాబాద్ మెగామస్టర్ 2050లో గుత్తేదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిందన్నారు. ఇంత చరిత్ర ఉన్న అసోయేసన్.. మూసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 

పాలమూరు మట్టి వాసన ఇష్టం

పాలమూరు అనే పదం తనకు చాలా ఇష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఆ మట్టి వాసన అంటే తనకు ఇష్టమన్నారు. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వెనకబడిన పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు.  వయసులో చిన్నవాడినైనా తన సహచర మంత్రులు తనకు ఎంతో బాధ్యత అప్పజెప్పారన్నారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు రేవంత్. 

 నేను కాంట్రాక్టర్ ను కాదు: కోమటిరెడ్డి

గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తాము ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తాను కాంట్రాక్టర్ ను కాదని చెప్పారు. తమ ప్రభుత్వం హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం బిల్డర్లకు సహకరిస్తుందన్నారు.