నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీ ప్రారంభించనున్న సీఎం

నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీ ప్రారంభించనున్న సీఎం
  •      ఈ నెల 16న జిల్లాలో పర్యటన

 నిర్మల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించి మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్​మాట్ బ్యారేజీని ప్రారంభించనున్నారు. మొదట సీఎం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్​లో ఆదిలాబాద్ వెళ్లి అక్కడ చనాక కొరాట ప్రాజెక్టు పంప్ హౌస్​ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి సీఎం పొనకల్ వద్దకు చేరుకొని సదర్​మాట్ బ్యారేజీ నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. 

మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్​లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన రూట్​మ్యాప్, షెడ్యూల్ విడుదలైంది. కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. 

ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన నేపథ్యంలో సదర్ మాట్ వద్ద, నిర్మల్ లో బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను సోమవారం కాంగ్రెస్ జిల్లా ఇన్​చార్జ్ తాహెర్ బిన్ హందాన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ శ్రీహరి రావు పర్యవేక్షించారు.  సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, హాది, లైబ్రరీ సంస్థ చైర్మన్ అర్జున్ మంద్ తదితరులు పాల్గొన్నారు.