V6 News

ఢిల్లీ లో డిసెంబర్ 11న పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ!

ఢిల్లీ లో  డిసెంబర్ 11న  పార్టీ పెద్దలతో సీఎం రేవంత్   భేటీ!
  •     కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర పార్టీ పదవులపై చర్చించే చాన్స్​

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ ​రెడ్డి గురువా రం కాంగ్రెస్ పెద్దలను కలువనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్​కు చేరుకొని.. వారితో భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీని సీఎం కలవనున్నట్లు సీఎంవో వర్గాలు తెలి పాయి. 

బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరు కున్న సీఎం రేవంత్​ రెడ్డి.. నేరుగా తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసానికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. గురువారం పార్లమెంట్​లో పార్టీ పెద్దలను కలిసి.. ప్రపంచస్థాయి పెట్టుబ డులను ఆకర్షించేలా రెండు రోజులపాటు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ –2047’ గ్లోబల్ సమిట్ వివరాలను పంచుకోనున్నట్లు తెలిసింది. 

అలాగే, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పదవులపై డిస్కషన్​ చేయనున్నారు. పార్లమెంట్​కు వెళ్తున్నందున.. రాష్ట్రా నికి సంబంధించిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. కాగా.. మధ్యాహ్నం ఆయన  తిరిగి హైదరాబాద్​కు బయలుదేరనున్నారు.