దేవరకొండలో డిసెంబర్ 6న సీఎం పర్యటన

దేవరకొండలో డిసెంబర్  6న సీఎం పర్యటన
  • హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్

 దేవరకొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 6న దేవరకొండకు రానున్నారు. నల్గొండ  కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులతో కలిసి సోమవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేయనున్న పనులు, బహిరంగ సభ, తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 

సీఎం పర్యటన విధులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాకూడదని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలసి ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ డిగ్రీ కాలేజీ పరిసరాలు ముదిగొండ రోడ్ లోని హెలిప్యాడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పబ్లిక్ సమావేశ స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట రెవెన్యూ అధికారులకు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఆర్ అండ్ బీ ఈ శ్రీధర్ వివిధ శాఖల ఆఫీసర్లు ఉన్నారు.