కామారెడ్డిలో క్వాలిటీ కరెంట్ ​సరఫరాకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి

కామారెడ్డిలో క్వాలిటీ కరెంట్ ​సరఫరాకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
  • ఓవర్ ​లోడ్​ ​ఏరియాల్లో అదనంగా 100 ట్రాన్స్ ఫార్మర్ల బిగింపు
  • సబ్​స్టేషన్లలోనూ పవర్​ ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు
  • జిల్లాలో లక్షా 88 వేల కనెక్షన్లకు  గృహజ్యోతి వర్తింపు

కామారెడ్డి, వెలుగు: కరెంట్​కోతలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్​అందించాలని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఓవర్​లోడ్​ను తగ్గించేందుకు అవసరమైన చోట్ల ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటుతో పాటు, సబ్​స్టేషన్లలో పవర్​ట్రాన్స్​ఫార్మర్ల స్థాయి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. సప్లయ్​లో అంతరాయం కలుగకుండా ఉండేందుకు జిల్లాలో 100 ట్రాన్స్​ఫార్మర్లను బిగించాల్సి ఉందని ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 20 చోట్ల పనులు పూర్తయ్యాయి. 

మిగతా చోట్ల కూడా ట్రాన్స్​ఫార్మర్ల బిగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాకాలంలో డిమాండ్ కు అనుగుణంగా సప్లయ్​చేయనున్నారు. జిల్లాలో మొత్తం 4,22,497 కరెంట్​కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ సంబంధమైనవి 2,69,177కాగా, అగ్రికల్చర్​కు సంబంధించినవి 1,09,004 కనెక్షన్లు ఉన్నాయి. ఏవరేజ్​గా రోజుకు 4.9 మిలియన్ యూనిట్ల కరెంట్​వినియోగిస్తారు. ఈ యాసంగిలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా కరెంట్​వినియోగం పెరిగింది. ప్రస్తుతం రోజుకు 6.5 మిలియన్​యూనిట్ల కరెంట్​ వాడుతున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్​లు లేకపోవడంతో బోర్ల కింద సాగవుతున్న ఆయకట్టే ఎక్కువగా ఉంది.

ట్రాన్స్​ఫార్మర్ల బిగింపు

ఓవర్​లోడ్​తగ్గించేలా సబ్​స్టేషన్లలో పవర్ ట్రాన్స్​ఫార్మర్ల  కెపాసిటీ పెంచుతున్నారు. అగ్రికల్చర్, డొమెస్టిక్​కు డిమాండ్​ఉన్న ఏరియాల్లో లోడ్​తగ్గించేందుకు అదనంగా 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ ట్రాన్స్​ఫార్మర్లను బిగిస్తున్నారు. కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి, మద్నూర్​ మండలాల్లో లోడ్​తగ్గించేందుకు పవర్ ట్రాన్స్​ఫార్మర్లను మారుస్తున్నారు. ఫీడర్లను సైతం ఎప్పటికప్పుడు ఛేంజ్​ చేస్తున్నారు.

గృహజ్యోతి లబ్ధిదారులు ఎంతమందంటే..

ప్రభుత్వం మంగళవారం ఆరు గ్యారంటీల్లో భాగంగా రూ.500కు గ్యాస్​ సిలిండర్​తో పాటు రూ.200 లోపు యూనిట్ల లోపు వాడే వారికి కరెంట్​ ఫ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కామారెడ్డి జిల్లాలో 2,69,177 ఇండ్లకు కరెంట్​కనెక్షన్లు ఉండగా లక్షా 88 వేల కనెక్షన్లకు ఫ్రీ కరెంట్​అర్హత ఉందని విద్యుత్​శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 0 నుంచి 50 వరకు యూనిట్లకు సంబంధించి 1,22,733 కనెక్షన్లు, 51నుంచి100 యూనిట్లకు సంబంధించి 72,411, 101 యూనిట్లు నుంచి 150 యూనిట్ల వరకు 26,609 ,151 యూనిట్లు నుంచి 200 యూనిట్ల వరకు 890 కనెక్షన్లు ఉన్నాయి. వీరికి వచ్చే నెల నుంచి జీరో బిల్లు రానున్నాయి.

నాణ్యమైన కరెంట్​ సప్లయ్​ చేస్తాం

జిల్లాలో ఎలాంటి కోతలు లేకుండా మెరుగైన కరెంట్​ సప్లయ్​కు చర్యలు చేపట్టాం. ఎక్కడైనా టెక్నికల్​ సమస్యలు తలెత్తితే వెంటనే రిపేర్లు చేస్తాం. ఓవర్ ​లోడ్​ సమస్యను తగ్గించేందుకు 100 ట్రాన్స్​ఫార్మర్లు బిగించాలని నిర్ణయించాం. పనులు కొనసాగుతున్నాయి. గృహజ్యోతి పథకానికి జిల్లాలో లక్షా 88 వేల మంది అర్హులుగా తేలారు. ఎవరైనా మిగిలిపోయిన వారుంటే అప్లయ్​ చేసుకోవచ్చు.

రమేశ్​బాబు, ఎన్​పీడీసీఎల్ ఎస్ఈ, కామారెడ్డి