మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి..కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం వినతి

మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి..కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం వినతి

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌కు మ‌‌‌‌రో 800 ఎల‌‌‌‌క్ట్రిక్ బ‌‌‌‌స్సులు కేటాయించాల‌‌‌‌ని కేంద్రమంత్రి కుమార‌‌‌‌స్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శ‌‌‌‌నివారం ఆయనతో సీఎం సమావేశమయ్యారు.పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్ కింద కేంద్రం ఇటీవ‌‌‌‌ల హైద‌‌‌‌రాబాద్‌‌‌‌కు 2 వేల ఎలక్ట్రిక్ బ‌‌‌‌స్సులు కేటాయించిందని, అయితే న‌‌‌‌గ‌‌‌‌ర అవ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. 

ఆర్టీసీ డ్రైవ‌‌‌‌ర్లు, మెకానిక్‌‌‌‌లు బ‌‌‌‌స్సు నిర్వహ‌‌‌‌ణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడ‌‌‌‌ల్‌‌‌‌ను ప‌‌‌‌రిగ‌‌‌‌ణ‌‌‌‌న‌‌‌‌లోకి తీసుకోవాల‌‌‌‌ని సూచించారు. ‘‘తెలంగాణ ఆర్టీసీలో డీజిల్ బ‌‌‌‌స్సుకు రెట్రో ఫిట్‌‌‌‌మెంట్ చేప‌‌‌‌ట్టగా అది స‌‌‌‌ఫ‌‌‌‌ల‌‌‌‌మైంది. ఆ బ‌‌‌‌స్సు న‌‌‌‌గ‌‌‌‌రంలో రాక‌‌‌‌పోక‌‌‌‌లు సాగిస్తున్నది. ప్రస్తుతమున్న డీజిల్ బ‌‌‌‌స్సుల‌‌‌‌కు రెట్రో ఫిట్‌‌‌‌మెంట్ అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి” అని కోరారు.ఈ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.