ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ.. పాలమూరుకు సమానంగా నిధులు: సీఎం రేవంత్

ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ.. పాలమూరుకు సమానంగా నిధులు: సీఎం రేవంత్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. జిల్లాకు వరాల జల్లులు కుర్పించారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బాసర త్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం (జనవరి 16) జిల్లా పర్యటనలో భాగంగా చనాకా కొరాటా ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

సీఎం రేవంత్ కామెంట్స్:

  • ఆదిలాబాద్ జిల్లా పోరాటాలు, పౌరుషాల గడ్డ
  • జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసిన నేల
  • రాంజీ గోండు, కొమురం భీం పోరాటం చేసిన నేల
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జరగాల్సిన న్యాయం జరగలేదు
  • ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తాం
  • పాలపూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ కు నిధులు ఇస్తా
  • గత పాలకులు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. చనాకా కొరాటా ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది
  • పదేళ్లయినా పూర్తి చేయలే
  • ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం
  • ఆదిలాబాద్ సస్యశ్యామలం కావాలంటే తుమ్మడిహెట్టి పూర్తి కావాల్సిందే
  • తుమ్మిడిహెట్టి కడతా.. ఆదిలాబాద్ నీటి కష్టాలు తీరుస్తాం
  • నిర్మల్ కు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం
  • ఆదిలాబాద్ కు విమానాలు తీసుకొచ్చే బాధ్యత మాది
  • పదేళ్లు ఏలిన వాళ్లు కేంద్ర నిధులు తీసుకోలే 
  • గత పాలకులు చేసిన అప్పులు, తప్పులు మనకు ఉరితాళ్లయ్యాయి
  • పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు
  • 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత.. మేము అభివృద్ధి చేస్తుంటే విమర్శలా
  • అభివృద్ధికి సూచనలిచ్చి సహకరించాలి