రేపు(జూన్ 19) సీఎం, నేను ఢిల్లీ వెళ్తం.. బనకచర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతాం

రేపు(జూన్ 19) సీఎం, నేను ఢిల్లీ  వెళ్తం.. బనకచర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతాం

చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ  బనకచర్ల ప్రాజెక్ట్ చేపడుతోందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడిన ఉత్తమ్.. ఏపీ చేపడుతోన్న బనకచర్లతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. 

 జూన్ 19న సీఎంతో పాటు తాను ఢిల్లీకి వెళ్తామన్నారు ఉత్తమ్.. పోలవరం -బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నాలోకి తరలించేందుకు ఏపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 

►ALSO READ | బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్..హాజరుకాని కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఉత్తమ్ కీలక కామెంట్స్

  • 300 టీఎంసీల కోసం బనకచర్లను ప్లాన్ చేస్తున్నారు
  • బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని తరలింపు
  • పెన్నాలోకి గోదావరి జలాలను తరలించి సీమకు నిరిచ్చేలా ప్లాన్
  • పోలవరం టూ ప్రకాశం, ప్రకాశం టూ బొల్లాపల్లికి నీటిని తరలిస్తారు
  • బనకచర్లతో విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించింది
  • బనకచర్ల  రాయలసీమకు చాలా కీలకమైన రెగ్యులేటర్
  • బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు వాడుకునేలా ఏపీ ప్లాన్
  • చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఏపీ బనకచర్ల కడుతోంది
  • పోలవరం- బనకచర్ల ప్రపోజల్ ను  తిరస్కరించాం
  • తిరస్కరించాలని కేంద్రాన్ని కూడా కోరాం
  • పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టులో గోదావరిలో మన వాటాకు నష్టం
  • బనకచర్లకు కేంద్ర ఆర్థిక సాయాన్ని కూడా మేము వ్యతిరేకించాం
  • పోలవరం -బనకచర్ల ప్రపోజలే..మన నీటి హక్కులపై కుట్ర
  •  రేపు సీఎం, నేను  కేంద్రమంత్రులను కలుస్తాం
  • పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతాం
  • పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలంతో పాటు మన్నూరు ఫ్యాక్టరీకి ఎఫెక్ట్
  • ఫ్లడ్ జలాలతో ప్రాజెక్టు కడుతున్నామనడం చట్ట విరుద్ధం
  •  గోదావరి బనకచర్లను కేంద్రం పరిశీలించడం రాష్ట్ర హక్కులను కాలరాయడమే
  • ఈ లింకుతో గోదావరి ట్రిబ్యునల్ అవార్డును కూడా ఏపీ తుంగలో తొక్కింది
  • బనకచర్లను కడుతున్నారని తెలియగానే అందరికీ చెప్పాం
  • ఏపీ తీరుపై సంబంధిత కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశాం
  • ఈ ప్రాజెక్టుపై జనవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం