మార్చి 11న భద్రాచలంలో సీఎం రేవంత్​ పర్యటన

మార్చి 11న భద్రాచలంలో సీఎం రేవంత్​ పర్యటన
  •     మిథిలాస్టేడియం నుంచి మార్కెట్​ కమిటీ యార్డుకు వేదిక తరలింపు
  •     ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్​, ఎస్పీలు
     

భద్రాచలం, వెలుగు :  ఈనెల 11న భద్రాచలంకు సీఎం రేవంత్​రెడ్డి రానున్నారు. రామాలయం దర్శనం తర్వాత తొలుత ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రామాలయం వద్ద మిథిలాస్టేడియంలో ప్రారంభించాలని షెడ్యూల్​లో పెట్టారు. అక్కడ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ప్రియాంక అలా ఆఫీసర్లను ఆదేశించారు. అయితే మిథిలాస్టేడియంలో బారికేడ్లు ఉండడం, 3వేల మందికి అక్కడ ఇబ్బంది ఉంటుందని గుర్తించిన ఆఫీసర్లు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో వేదికను చర్ల రోడ్డులోని వ్యవసాయ మార్కెట్​కమిటీ యార్డులోకి మర్చారు. యార్డులో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ రోహిత్​రాజ్​ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని శాఖల ఆఫీసర్లతో ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్​ రివ్యూ చేశారు. ఆయా శాఖలపై సీఎం వివరాలు అడిగే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయి నివేదికలతో రావాలని ఆదేశించారు.