కమీషన్ల కోసమే.. జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్

కమీషన్ల కోసమే.. జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో రోజుకు 8 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయినా కేసీఆర్ కళ్లు మూసుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి .  జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయినప్పుడే  రాయలసీమ ప్రాజెక్టు తతంగం జరిగిందన్నారు.  కేసీఆర్ తో ప్రగతి భవన్ లో  6 గంటల భేటీ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్   ప్రాజెక్టు జీవో వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఇంటికే  వచ్చి జగన్ మన నీటికి కన్నం పెట్టారని ధ్వజమెత్తారు.  రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పూర్తిగా కేసీఆర్ ధనదాహాం కారణమన్నారు.  కమీషన్ల కోసమే జగన్ తో కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. 

కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ ఆనాడే సంతకం చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.. మనకు రావాల్సిన 50 శాతం వాటాపై కేసీఆర్ నోరు మెదపలేదన్నారు.  తెలంగాణకు రావాల్సిన నీటివాటాను ఆంధ్రాకు కేసీఆర్  అప్పజెప్పారని ఆరోపించారు.  మనకు రావాల్సిన నీటి వాటాను కేసీఆర్ శాశ్వతంగా  రాకుండా చేశారన్నారు. 2019లో నిసిగ్గుగా పాత పద్దతిలో నీటిని వాడుకుందామని కేసీఆర్ చెప్పారన్నారు. 2022లో కృష్ణా ప్రాజెక్టులు అప్పజెప్తామని కేఆర్ఎంబీ మీటింగ్ లో కేసీఆర్ సంతకం చేశారు..  2023లోనూ కృష్ణా  బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తూ సాగునీటి శాఖ మంత్రిగా కేసీఆర్  సంతకం చేశారని రేవంత్ తెలిపారు. 

ప్రాజెక్టుల నిర్వహాణ కోసం బోర్డులకు  కేసీఆర్.  రూ.400 కోట్లు కేటాయించారని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టుల అన్ని  వ్యవహారాలన్ని మామా అల్లుళ్ల సమక్షంలోనే జరిగాయని ఆరోపించారు.  పోతిరెడ్డి పాడు నీటి దోపిడి జరిగినప్పుడు బీఆర్ఎస్ నేతలే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఇపుడు బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పారని తమపై బీఆర్ఎస్ నేతలు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.