జులై 4న మిడ్జిల్ కు సీఎం.. 20 ఏండ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

జులై 4న  మిడ్జిల్ కు సీఎం.. 20 ఏండ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం
  • మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లో రూ.455 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

నాగర్​కర్నూల్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్చిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏండ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా... ఊర్కొండ మండలంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. 

అనంతరం మిడ్జిల్ మండలంలో రూ.323 కోట్లు, ఊర్కొండ మండలంలో రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అలాగే రూ. 10 కోట్లతో చేపట్టే ఊర్కొండ అభయాంజనేయ దేవాలయ అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆత్మీయులు, రాజకీయ సహచరులతో కలిసి సీఎం రేవంత్​భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్​జిల్లాల ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిడ్జిల్​లో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు కాంగ్రెస్​నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.