డిసెంబర్ 3న హుస్నాబాద్ కు సీఎం.. రూ.262.68 కోట్ల పనులకు శంకుస్థాపన

డిసెంబర్ 3న  హుస్నాబాద్  కు సీఎం.. రూ.262.68 కోట్ల పనులకు శంకుస్థాపన
  •     బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి బుధవారం హుస్నాబాద్​కు వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కన్నపేట రోడ్డులోని అమరుల స్తూపం వద్ద జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజులుగా ఇక్కడే ఉండి సభా ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఈ పర్యటనలో రూ.262.68 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ అభివృద్ధికి రూ.44.12 కోట్లు, ఏటీసీ సెంటర్ నిర్మాణానికి - రూ.45.15 కోట్లు, హుస్నాబాద్ – -కొత్తపల్లి ఫోర్ లేన్​ హైవేకు రూ.86 కోట్లు, హుస్నాబాద్ – -అక్కన్నపేట హాం ఫోర్​ లేన్​ హైవేకు రూ.58.91 కోట్లు, హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు, ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ నిర్మాణానికి రూ.8.5 కోట్లు మంజూరు కాగా, ఆ పనులకు రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు.