దేశంలో తొలిసారిగా స్కూళ్లో విద్యార్థులకు ఉదయాన్నే అల్పాహారం అందించే పథకాన్ని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ 2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున ప్రారంభించారు. నాగపట్నం జిల్లాలో సిఎం అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సీఎం అల్పాహారాన్ని తిన్నారు.
1,545 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల్లో 1,14,095 మంది విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఆకలితో అలమటించకుండా పాఠశాలలకు వచ్చేలా చూడడం, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడటం, పిల్లలకు పోషకాహారం అందే పరిస్థితిని మెరుగుపరచడం, రక్త హీనత వంటి సమస్యలను విద్యార్దులు అధిగమించడం ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు.
ఈ ఫథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 404 కోట్లను ఖర్చు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తమ నియోజకవర్గాల్లో పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని స్టాలిన్ కోరారు.