సీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం

సీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం

ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటన తెలంగాణ రైతులు, బీజేపీ కార్యకర్తల విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే కేసీఆర్ దిగొచ్చిండని చెప్పారు.  ఇకపై కరెంటు, ఆర్టీసీ ఛార్జీల తగ్గింపే లక్ష్యంగా బీజేపీ పోరాటం చేస్తుందని సంజయ్ స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరేనన్న సీఎంతో వరి కొనిపించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్న ఆయన.. తన కుట్రలను రైతులు నమ్మకపోవడంతోనే కేసీఆర్ దిగొచ్చాడని అన్నారు. ధాన్యం కొనుగోలు నిర్ణయాన్ని కేసీఆర్ ముందే తీసుకునే ఉంటే రైతులకు న్యాయం జరిగేదని, నష్టపోయిన అన్నదాతలను ఆదుకునే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే ఉందని చెప్పారు. గంట సేపు కూడా ధర్నాలో కూర్చోలేని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

పాతబస్తీలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేయలేని అసమర్థుడు కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. పాతబస్తీలో కరెంటు ఛార్జీలు వసూలు చేయకపోవడం వల్ల ఏడాదికి వెయ్యి కోట్ల నష్టం కలుగుతోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్నును కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం..

కర్ణాటకలో కలకలం రేపిన కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి

కొడుకు ఆచూకీ కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లి