కొడుకు ఆచూకీ కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లి

కొడుకు ఆచూకీ కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లి

హైదరాబాద్: కన్న కొడుకు ఆచూకీ కోసం ఓ తల్లి హెచ్చార్సీని ఆశ్రయించింది. తప్పిపోయిన కొడుకు కోసం పదేళ్లుగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరైంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని మానవ హక్కుల కమిషన్ ను కోరింది. 

ప్రకాశం జిల్లాకు చెందిన నరేష్, వనజ దంపతులు 2012లో బ్రతుకుదెరువు కోసం కొడుకు సంతోష్, కూతురు సంజనతో హైదరాబాద్కు వచ్చారు. 2013లో స్కూల్ వెళ్తున్న నాలుగేళ్ల సంతోష్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రులు శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఆచూకీ తెలుసుకునేలా పోలీసులను ఆదేశించాలని వనజ కమిషన్ను వేడుకుంది. తల్లి ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ ఆగస్టు 26లోగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆర్జీఐ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ SHOను ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం..

వడ్లను మేమే కొంటం

ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్